కృష్ణా: పెడన 13వ వార్డులో మంగళవారం హౌస్ టు హౌస్ ఫీవర్ సర్వే నిర్వహించారు. సూపర్‌వైజర్ సూరిబాబు ఇంటింటికీ వెళ్లి, ప్రజల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి, జ్వరం, తదితర లక్షణాలు ఉన్న వారిని గుర్తించి, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన


