హైదరాబాద్: 28°C
తెలంగాణ

లేగ దూడపై చిరుత దాడి

KMR: తాడ్వాయి మండలంలో మరోసారి చిరుత పులి దాడిలో లేగ దూడ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. నందివాడ గ్రామ పరిధిలోని తిరుమయకుంట తండా సమీపంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు మంగళవారం తెలిపారు. తండాకు చెందిన జాదవ్ సంతోష్‌కు చెందిన లేగ దూడ రెండు రోజులుగా కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు పరిసర అటవీ ప్రాంతంలో వెతికినా ఆచూకీ లభించలేదు.