హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాపన్నకు పొన్నాల ఘన నివాళి

HYD: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా పొన్నాల లక్ష్మయ్య ఘన నివాళులర్పించారు. బహుజన ఆత్మగౌరవం, సామాజిక న్యాయానికి పాపన్న ప్రతీక అని పేర్కొన్నారు. పేదల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. పాపన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.