ASR: పసుపు పంటలో రైజ్డ్ బెడ్ విధానంతో నీటి నిల్వను తగ్గించడంతో పాటు, దుంప కుళ్ళు వంటి వ్యాధులను నివారించవచ్చని శాస్త్రవేత్తలు డాక్టర్ రాజశేఖర్, అప్పలరాజు తెలిపారు. నేలలో గాలి ప్రసరణ మెరుగుపడి అధిక దిగుబడులు సాధించవచ్చని వివరించారు. ఈ మేరకు వారు మంగళవారం చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో పసుపు రైతులకు శిక్షణ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
'రైజ్డ్ బెడ్ విధానంతో పసుపు సాగు మేలు'


