BPT: వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో వర్షాభావం తొలగి వర్షాలు కురవాలని వరుణయగం నిర్వహించారు. పందిళ్ళమ్మ తల్లికి పోతురాజు స్వామికి మన్ను కట్టు కార్యక్రమం గత ఐదేళ్లుగా చేస్తున్నామని పోలకం చంద్ర శేఖర్ తెలిపారు. వర్షాకాలం వచ్చినప్పటికీ వర్షాలు కురవక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ భగవంతుడు ఆశీస్సులు ప్రజలపై ఉండాలని కోరుతూ వరుణ యాగం చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
వేటపాలెంలో వరుణ యాగం


