హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమలగిరి నకిలీ ఉత్తర్వులపై మంత్రి ఆగ్రహం

NTR: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, తిరుమలగిరి క్షేత్రంలో నకిలీ ఉత్తర్వులతో విధుల్లో చేరిన ఉద్యోగుల అంశంపై కథనంపై స్పందించారు. ఈ కుంభకోణంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. బాధ్యులైన ప్రతీ ఉద్యోగిపై కఠిన శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. దేవాదాయ శాఖలో పారదర్శకతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.