WNP: పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో నందిమల్ల శైలజ ఇంటి తాళాలు పగులగొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. సుమారు 10 తులాల 8 గ్రాముల బంగారం, 24 గ్రాముల వెండి, రూ. 30 వేల నగదును అపహరించారు. బాధితురాలి ఫిర్యాదుతో హెడ్ కానిస్టేబుల్ రామచంద్రయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు గుర్తు తెలియని దొంగల కోసం దర్యాప్తు ముమ్మరం చేసి, సీసీ కెమెరాలను పరిశీలించారు.
తెలంగాణ
ఇంట్లో చోరీ.. బంగారం, నగదు అపహరణ


