హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జల్ జీవన్ మిషన్ పనులను వేగవంతం చేయాలి'

KKD: కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ జిల్లాలో జల్ జీవన్ మిషన్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం గ్రామీణ నీటి సరఫరా శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యమన్నారు. గ్రామస్థాయిలో నీటి వనరుల సక్రమ వినియోగానికి వాటర్ సెక్యూరిటీ ప్లాన్ రూపొందించాలని సూచించారు.