హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు ఐడీవోసీలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సమావేశం

BHPL: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యులు రేపు ఉదయం 11 గంటలకు భూపాలపల్లి ఐడీవోసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన సమస్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు. అధికారులు సమయానికి హాజరుకావాలని సూచించారు.