WNP: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై బీఆర్ఎస్ చేపడుతున్న ధర్నాలు రాజకీయ లబ్ధి కోసమేనని మదనాపురం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పల్లెపాగ ప్రశాంత్ విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు పథకాలకు చట్టబద్ధత ఎందుకు కల్పించలేదో బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకుల ఆందోళనలతో ప్రజలకు ఇబ్బందులు కలిగించడం సరికాదని అన్నారు.
తెలంగాణ
బీఆర్ఎస్ ధర్నాలు రాజకీయ లబ్ధి కోసమే: ప్రశాంత్


