AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ గవరవీధిలో మంగళవారం సాయంత్రం శ్రీ గౌరీ పరమేశ్వరుల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఆలయం వద్ద నుంచి మేళ తాళాలతో స్వామి అమ్మవార్లను పురవీధుల గుండా ఊరేగించారు. ఉత్సవమూర్తులను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఊరేగింపులో మహిళా భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు పెంటారావు, నాయుడు, తదితరులు ఊరేగింపులో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఘనంగా గౌరీ పరమేశ్వరులు ఊరేగింపు


