హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం

ASR: చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ప్రిన్సిపల్ డాక్టర్ వీ.రమణ నేతృత్వంలో జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు జాతీయ ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ప్రిన్సిపల్ సూచించారు.