హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఈనెల 31న తుది జాబితా ప్రకటించాలి'

ASR: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లను చేపట్టాలని కలెక్టర్ నిశాంతి మంగళవారం అధికారులను ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని ఎంపీడీవోలు పరిశీలించి తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఫర్నిచర్, వికలాంగుల కోసం ర్యాంపులు, సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈనెల 23న పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా ప్రకటించి, 31న తుది జాబితా ప్రకటించాలన్నారు.