హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉపాధ్యాయుడి సస్పెన్షన్ ఎత్తివేయాలి'

KNR: కేరళలో సావర్కర్‌పై ప్రశ్న అడిగిన ఉపాధ్యాయుడు గురు ప్రసాద్‌ను సస్పెండ్ చేయడం అన్యాయమని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) కరీంనగర్ జిల్లా శాఖ పేర్కొంది. ఈ మేరకు జిల్లా అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేకు వినతిపత్రం సమర్పించింది. ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌ను తక్షణమే ఉపసంహరించాలని, ఉపాధ్యాయుల విద్యా స్వేచ్ఛ, గౌరవాన్ని కాపాడాలని సంఘం కోరింది.