PPM: పశువులను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో కురుపాం పోలీసులు తనిఖీలు చేపట్టి 6 ఆవులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని గరివిడి శ్రీ దుర్గామల్లేశ్వరి గో సంరక్షణ గోశాలకు తరలించారు. ఈ ఘటనపై కేదారపురానికి చెందిన బిడ్డక రంజిత్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పి. నారాయణరావు తెలిపారు. పశువుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.
ఆంధ్రప్రదేశ్
పశువుల అక్రమ రవాణాకు చెక్


