MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలో మంగళవారం తెలంగాణ ఉద్యమకారుల అత్యవసర సమావేశం సప్పిడి రాంనర్సయ్య అధ్యక్షతన జరిగింది. జిల్లా అధ్యక్షుడు పోరిక గోవింద్ నాయక్ మాట్లాడుతూ.. ఉద్యమకారుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ ఏర్పడిందన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించకపోవడం నిరంకుశ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. వెంటనే అనుమతి ఇవ్వాలన్నారు.
తెలంగాణ
'పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహానికి అనుమతి ఇవ్వాలి'


