ASR: జీకేవీధి మండలం పెదవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మంగళవారం సీఐ బీ.సుధాకర్ సందర్శించారు. విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు, సైబర్ మోసాల నియంత్రణపై విద్యార్థులకు వివరించారు. గంజాయి రవాణా వల్ల ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలు, యువతపై దాని ప్రభావం గురించి అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
'చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి'


