హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంజాయి రవాణాపై నిఘా

AKP: రోలుగుంట పీఎస్ పరిధిలోని కొంతలం, అడ్డసారం కొండ మార్గాల్లో గంజాయి రవాణా, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పోలీసులు మంగళవారం డ్రోన్లతో నిఘా చేపట్టారు. కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, ఎస్సై రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. యువత చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, నిరంతర నిఘా ఉంటుందని సీఐ హెచ్చరించారు.