SRPT: సూర్యాపేట జిల్లా పోలీసు శాఖకు అత్యాధునిక మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ అందుబాటులోకి వచ్చింది. ఎస్పీ నరసింహ మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతికతతో కేసుల దర్యాప్తు వేగవంతం అవుతుందని, సంఘటన స్థలంలోనే ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించి నిందితులకు త్వరగా శిక్షించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ ఉన్నారు.
తెలంగాణ
పోలీసులకు అత్యాధునిక మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్


