హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖపట్నంలో బ్రిక్స్ దేశాల సమ్మిట్

VZM: విశాఖ వేదికగా ఈ నెల 22, 23 తేదీల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న బ్రిక్స్ దేశాల యువజన, క్రీడా మంత్రుల సమ్మిట్ ఏర్పాట్లపై CS సాయిప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అతిధులంతా ఈ నెల 21 న భోగాపురం ఎయిర్‌పోర్టుకు రానున్నారని, తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ వీసీలో కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పాల్గొన్నారు.