SS: పెనుకొండ మండలం గ్లోవిస్ సమీపంలో మంగళవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం చెందింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న భార్యాభర్తలను కియా అనుబంధ సంస్థకు చెందిన బస్సు ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో అమ్మవారుపల్లికి చెందిన రమాదేవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
పెనుకొండ వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి


