హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ‘సారిక ఏఐ’ సేవలు ప్రారంభం

VSP: ఏఐ ఆధారంగా పనిచేసే ‘సారిక ఏఐ’ (పైలట్ ప్రొటోటైప్) సేవలు విశాఖ రైల్వే స్టేషన్‌లో అందుబాటులోకి వచ్చాయి. సాంకేతికత, ఆవిష్కరణలను మేళవించి రూపొందించిన ఈ వ్యవస్థ ద్వారా రైల్వే ఎంక్వైరీ సేవలను ప్రయాణికులకు మరింత వేగంగా, సులభంగా అందించనున్నారు. విశాఖ స్టేషన్‌లో ఈ ‘సారికఏఐ’ తెలుగు, ఇంగ్లీష్, ఒడియా భాషల్లో ప్రయాణికులతో సంభాషిస్తూ సహాయం చేస్తోంది.