హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాడిపత్రిలో సాగునీటి కాలువల పూడికతీత పనులు

ATP: తాడిపత్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యే జేసీ అష్మిత్‌రెడ్డి సొంత, ప్రభుత్వ నిధులతో సాగునీటి కాలువల మరమ్మత్తులు చేపట్టారు. చాగల్లు రిజర్వాయర్ కుడి కాలువ, పెండేకల్లు రిజర్వాయర్ ప్రధాన కాలువ గేట్లకు మరమ్మత్తులు చేశారు. పెద్దవడుగూరు నుంచి చింతలాయపల్లి చివరి ఆయకట్టు వరకు పూడికతీత, ముళ్లపొదల తొలగింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.