హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాల పరిశీలనలో అధికారులు

ELR: గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉంగుటూరు మండలంలో పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను మంగళవారం అధికారులు పరిశీలించారు. ఉంగుటూరు, వెల్లమిల్లి, కాగుపాడు, రావులపర్రు, గోపినాధపట్నం, నాచుకుంట, నీలాద్రిపురం పోలింగ్ కేంద్రాలను అధికారుల బృందం సందర్శించింది. ఎంపీడీవో జి ఆర్ మనోజ్, తహసీల్దార్ వై. సన్యాసిరావు, డిప్యూటీ ఎంపీడీవో జి రమేష్ బాబు వారిలో ఉన్నారు.