SKLM: పొందూరు మండలం రాపాక గ్రామానికి చెందిన పతివాడ రవణమూర్తి తమ్ముడు కోటి ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాకుళం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి రాపాక గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులను ఓదార్చిన అనంతరం మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే


