హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భూసేకరణ వేగంగా పూర్తి చేయండి: కలెక్టర్

VZM: జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) ఆధ్వర్యంలో చేపట్టనున్న వివిధ పారిశ్రామిక ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం ఏపీఐఐసీ ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.