హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు

ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మిత దాడులు నిర్వహించారు. మున్సిపల్ ఆర్ఐ వెంకట నరేంద్ర రూ. 15వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. టైటిల్ మార్పు విషయంలో వెంకట నరేంద్ర లంచం డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఏసీబీ అధికారుల విచారణ కార్యాలయంలో కొనసాగుతోంది.