పార్వతీపురం పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలోని ప్రధాన రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు, పట్టణ కార్యదర్శి గొర్లి వెంకటరమణ డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రహదారి అధ్వానంగా ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'పాత బస్టాండ్ రోడ్డు మరమ్మతులు చేపట్టాలి'


