కృష్ణా: మచిలీపట్నం లేడీ యాంప్తుల్ ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో విద్యార్థినులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న చిలకలపూడి ఎస్సై పద్మ మాట్లాడుతూ.. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకుని నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, 18 ఏళ్లు నిండకముందు డ్రైవింగ్ చేయొద్దని, ఆపదలో 112కు ఫోన్ చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'చట్టాలపై అవగాహనతో నేరాలకు దూరంగా ఉండాలి'


