KMR: జుక్కల్ నియోజకవర్గంలోని చారిత్రక కౌలాస్ కోటను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడానికి ఎంపిక చేసిన కోటల జాబితాలో చేర్చడం హర్షణీయమని స్థానికులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కృషి, చొరవతో కౌలాస్ కోటకు మరింత ప్రాధాన్యత లభించడం నియోజకవర్గ ప్రజలకు గర్వకారణమన్నారు. కోట అభివృద్ధితో పర్యాటక రంగానికి మరింత ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ
'అభివృద్ధికి కౌలాస్ కోట ఎంపిక'


