హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సబ్సిడీలు అందించేలా ప్రణాళిక సిద్ధం చేయాలి'

నెల్లూరు జిల్లాలో ప్రజలకు బ్యాంకింగ్ సేవలు, కేంద్ర పథకాల సబ్సిడీలు దగ్గర చేసేందుకు మెగా రుణమేళా నిర్వహించాలని MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సూచించారు. నరసరావుపేట తరహాలో 1.04 లక్షల మందికి రూ.3216 కోట్ల రుణాలు, సబ్సిడీలు అందించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్‌ను, బ్యాంకర్లను కోరారు. గతేడాది 128% పనితీరుతో జిల్లా బృందాన్ని అభినందించారు.