హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నేరాల నియంత్రణకు లాడ్జి యాజమాన్యాలు సహకరించాలి'

ATP: జిల్లాలో నేరాల నియంత్రణకు లాడ్జి యజమానులు, సిబ్బంది పోలీసులకు సహకరించాలని ఎస్పీ పి.జగదీష్ సూచించారు. లాడ్జి నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లాడ్జిల్లో విడిది చేసే వారి వివరాలను 'AI-AVMS' యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. గుర్తింపు కార్డులు పరిశీలించిన తర్వాతే గదులు కేటాయించాలని తెలిపారు.