హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీశైల అన్నప్రసాదానికి 1.01 లక్షల విరాళం

NDL: భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న శాశ్వత అన్నప్రసాద వితరణ పథకానికి తూర్పుగోదావరి జిల్లా వరప్రసాద్ రూ.1,01,000 విరాళం అందించారు. మంగళవారం స్వామి, అమ్మవార్ల దర్శనం అనంతరం విరాళాల కేంద్రంలో పర్యవేక్షకురాలు హిమబిందికి నగదు అందజేశారు. దాతను బాండ్, శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.