హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కంభంలో తూనికల కొలతల అధికారుల దాడులు

ప్రకాశం: కంభం పట్టణంలోని పలు హార్డ్‌వేర్, ప్లైవుడ్, ఎలక్ట్రిక్ షాపుల్లో తూనికలు కొలతల అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన మూడు షాపులపై కేసులు నమోదు చేసి మొత్తం రూ.19,000 జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. వ్యాపారులు తూనికలు, కొలతల విషయంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.