హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీసీల అభ్యున్నతికి టీడీపీ కృషి చేస్తుంది: ఎమ్మెల్యే

ATP: వైసీపీ పాలనలో బీసీలను రాజకీయంగా ఎదగకుండా జగన్‌మోహన్‌రెడ్డి అణచివేశారని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక అవకాశాలు కల్పించిన ఘనత టీడీపీకే దక్కుతుందని, ఎన్టీఆర్ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చారని గుర్తుచేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి అవకాశాలు కల్పిస్తూ ముందుకు సాగుతోందన్నారు.