కృష్ణా : బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరిస్తున్నందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మంత్రి కొల్లు రవీంద్ర ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ హయాంలోనే బీసీలకు రిజర్వేషన్లు కల్పించామని, గత వైసీపీ ప్రభుత్వం వాటిని 24 శాతానికి తగ్గించిందని విమర్శించారు. బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బీసీలకు 34% రిజర్వేషన్లు పునరుద్ధరణ: మంత్రి


