హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆకివీడు మున్సిపల్ ఛైర్మన్‌కు ప్రత్యక్ష ఎన్నికలు

WG: ఆకివీడు నగర పంచాయతీ ఛైర్మన్‌ను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునేందుకు రాష్ట్ర మంత్రి వర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఇక్కడ 28 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. గతంలో కౌన్సిలర్లు ఛైర్మన్‌ను ఎన్నుకునేవారు. ఇక నుంచి ప్రజలే నేరుగా ఎన్నుకోనున్నారు. దీంతో స్థానిక ఓటర్లు ఛైర్మన్‌కు ఒకటి, కౌన్సిలర్‌కు మరొకటి చొప్పున రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది.