హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శబరిమలైకి బయలుదేరిన ఎమ్మెల్యే

CTR: అయ్యప్ప దీక్ష చేపట్టిన పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం శబరి యాత్రకు బయలుదేరారు. తిరుపతిలోని తన స్వగృహంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి తదితరులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇరుముడులు కట్టుకొని పలువురు స్వాములతో కలిసి శబరి యాత్రకు పయనమయ్యారు.