AKP: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రాంబిల్లి ఏవో సుమంత సూచించారు. ఈ మేరకు మంగళవారం మురకాడ, మర్రిపాలెంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. రైతులందరూ క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి'


