ELR: ఉంగుటూరు (M) ఉప్పాకపాడు నుంచి బొమ్మిడి వెళ్లే ప్రధాన రహదారి కోతకు గురవుతుంది. తోకలపల్లి మురుగుకోడు కాలువ వైపున రోడ్డు కుంగిపోయింది. లక్షలాది రూపాయల నిధులతో వేసిన రోడ్డు ఇలా ఉండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డుపై రోజూ వందలాది మంది విద్యార్థులు, రైతులు, ప్రయాణిస్తారు. రోడ్డు కుంగిపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్
కోతకు గురవుతున్న బొమ్మిడి ప్రధాన రహదారి


