NTR: సీఐటీయూ నాయకులు, కీసర గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ కార్యదర్శి సుబ్రహ్మణ్యంకు వినతిపత్రం సమర్పించారు. కంచికచర్ల మండలం కీసర గ్రామంలో డ్రైనేజీ లేక రోడ్లపై మురుగునీరు నిలిచిపోతుందని, వీధి దీపాలు సరిగా లేవని, తీవ్ర తాగునీటి సమస్య ఉందని తెలిపారు. మునేరు నది పక్కనే ఉన్నా, బోరు నీరు ఉప్పుగా ఉండటంతో ప్రజలు క్యాన్ల నీరు కొనుక్కుంటున్నారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కీసరలో తాగునీటి సమస్యలు పరిష్కరించాలి'


