హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'డ్రైవర్లు అప్రమత్తంగా విధులు నిర్వహించాలి'

కృష్ణా: గుడివాడ ఆర్టీసీ డిపో గ్యారేజీలో డ్రైవర్లు, కండక్టర్లకు రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలపై టూ టౌన్ సీఐ హనీశ్ మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు సురక్షితమైన, ప్రమాద రహిత ప్రయాణాన్ని అందించేందుకు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలకు ట్రాఫిక్ ఉల్లంఘన ప్రధాన కారణమని తెలిపారు.