ASR: మారికవలస గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను యధావిధిగా అదే పాఠశాలలో కొనసాగించాలని తల్లిదండ్రులు కోరారు. ఈ మేరకు వారు మంగళవారం ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మకు వినతి అందజేశారు. తమ పిల్లలను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయకుండా మారికవలస పాఠశాలలోనే విద్యను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం దృష్టికి మరోసారి సమస్యను తీసుకెళ్తామని పీవో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మరోసారి ప్రభుత్వం దృష్టికి సమస్య


