హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భూగర్భ జలాల పెంపుకు ప్రాధాన్యత

AKP: కొత్తగా అమలలోకి వచ్చిన వీబీ జీ రామ్ జీ పథకం కింద భూగర్భ జలాల పెంపుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ అడిషనల్ పీడీ మణికుమార్ తెలిపారు. ఎలమంచిలి ఎంపీడీవో కార్యాలయంలో 6 మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులకు వీబీ జీ రామ్ జీ పథకంపై అవగాహన కల్పించారు. పండ్ల తోటల పెంపును ప్రోత్సహిస్తున్న ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.