హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలి'

ASR: ఏజెన్సీలో 100శాతం ఉద్యోగ, ఉపాధ్యాయ నియామక రిజర్వేషన్ కల్పించే బిల్లును రాష్ట్ర వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో తక్షణమే ప్రవేశపెట్టాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మంగళవారం అరకులో డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు, రిజర్వేషన్ చట్టం చేసే వరకు అన్ని రకాల ఉద్యోగ నోటిఫికేషన్లను నిలుపుదల చేయాలన్నారు.