హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాపన్న పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకం

కోనసీమ: కామనగరువులో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను బీజేపీ, ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, ఆయన పోరాట స్ఫూర్తిని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం పాపన్న గౌడ్ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నాయకులు పేర్కొన్నారు.