అన్నమయ్య: రాయచోటిలో 2024 ఎన్నికల ప్రచార వివాదంలో జరిగిన హత్యాయత్నం కేసులో కాటిమాయకుంట గంగాధర్, అబ్బవరం శివరాం ప్రసాద్‌లకు న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఒక్కొక్కరికి రూ.1,000 జరిమానా విధిస్తూ రాయచోటి అసిస్టెంట్ సెషన్స్ జడ్జి ఈ. ప్రసూన తీర్పు ఇచ్చారు. దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
హత్యాయత్నంలో ఇద్దరికి మూడేళ్ల జైలు


