హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బడిబయట పిల్లల నమోదుపై ప్రత్యేక శ్రద్ద: జేసీ

PPM: పాఠశాలల హేతుబద్ధీకరణ, బడి మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించడంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి పేర్కొన్నారు. మంగళవారం తన ఛాంబర్‌లో గిరిజన శాఖ డీడీ, ATWO, ఉప విద్యా శాఖాధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా ఉపాధ్యాయుల సర్దుబాటు ఉండాలన్నారు.