అన్నమయ్య: HNSS ఫేజ్ – II మిగిలిన పనులకు రూ.1,323.75 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు కావడంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాయచోటి నియోజకవర్గంలో కిమీ 490 – 535 వరకు సుమారు రూ.350 కోట్ల పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. పనులు పూర్తయితే 25 వేల ఎకరాల చెరువులకు నీరు అందించి, అన్నమయ్య జిల్లా ప్రజలకు తాగు, సాగునీటి భరోసా కల్పిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాయచోటికి రూ.350 కోట్లు: మంత్రి


