హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎయిర్ బ్యాగులు ప్రాణాలు కాపాడాయి!

నెల్లూరు నుంచి గూడూరు వైపు వెళ్తున్న ఓ కారు మనుబోలు మండలం వీరంపల్లి క్రాస్రోడ్డు వద్ద ప్రమాదానికి గురైంది. రహదారిపై అకస్మాత్తుగా ఎదురుగా వచ్చిన లారీని తప్పించుకునే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో రోడ్డు డివైడర్ను బలంగా ఢీకొని బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో భారీ ప్రమాదం తప్పింది.